ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో 6425 క్లరికల్ పోస్టులు
* తెలుగు రాష్ట్రాల్లో 1294 ఉద్యోగాలు
* వీటిలో ఎస్‌బీహెచ్ వాటా 1240
* తెలంగాణలో 1012, ఆంధ్రప్రదేశ్‌లో 282 మొత్తం ఖాళీలు
బ్యాంకుల్లో నియామకాల జోరు పెరుగుతోంది. ఒక పరీక్ష పూర్తయినవెంటనే మరో పరీక్షకు ప్రకటన వెలువడుతోంది. తాజాగా అనుబంధ బ్యాంకుల్లో ఖాళీలు భర్తీ చేయడానికి ఎస్‌బీఐ ప్రకటన విడుదలచేసింది. 5 బ్యాంకుల్లో దేశవ్యాప్తంగా 6425 ఖాళీలున్నాయి. వీటిలో ఐదో వంతు పోస్టులు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొత్తం 1294 ఉద్యోగాలున్నాయి. ఇందులో 1240 మందిని ఎస్‌బీహెచ్ భర్తీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ బ్యాంకు ద్వారా వెయ్యి మందికి కొలువు సొంతం కానుంది. ప్రకటన వెలువడిన నేపథ్యంలో పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం.
ఖాళీలిలా...
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్‌బీహెచ్‌లో 1000, బికనీర్ అండ్ జైపూర్ బ్యాంక్‌లో 12 పోస్టులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్‌బీహెచ్‌లో 240, ట్రావెన్‌కోర్ బ్యాంకులో 30, బికనీర్ అండ్ జైపూర్ బ్యాంక్‌లో 12 ఖాళీలున్నాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 20, 2014 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 9, 2014
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 11, 2014
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.వంద, మిగిలిన అందరికీ రూ.600
ఆన్‌లైన్ పరీక్ష: 2015 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వివిధ తేదీల్లో నిర్వహిస్తారు.
* తెలుగు రాష్ట్రాల్లో 1294 ఉద్యోగాలు
* వీటిలో ఎస్‌బీహెచ్ వాటా 1240
* తెలంగాణలో 1012, ఆంధ్రప్రదేశ్‌లో 282 మొత్తం ఖాళీలు

ఖాళీలిలా...
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్‌బీహెచ్‌లో 1000, బికనీర్ అండ్ జైపూర్ బ్యాంక్‌లో 12 పోస్టులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్‌బీహెచ్‌లో 240, ట్రావెన్‌కోర్ బ్యాంకులో 30, బికనీర్ అండ్ జైపూర్ బ్యాంక్‌లో 12 ఖాళీలున్నాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 20, 2014 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 9, 2014
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 11, 2014
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.వంద, మిగిలిన అందరికీ రూ.600
ఆన్‌లైన్ పరీక్ష: 2015 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వివిధ తేదీల్లో నిర్వహిస్తారు.
No comments:
Post a Comment